Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన సహాయకుడి వర్ధంతి సందర్భంగా భావోద్వేగాలకు లోనైన అనుష్క

  • సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన స్వీటీ
  • అందాలభామ తాత్విక వ్యాఖ్యలు
  • లక్షకు దరిదాపుల్లో లైకులు
టాలీవుడ్ అందాల హీరోయిన్ అనుష్క తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన ఓ పోస్టు ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతోంది. గతంలో తన వద్ద పనిచేసిన రవి అనే సహాయకుడు మృతి చెందగా, అతడి వర్థంతిని పురస్కరించుకుని అనుష్క పోస్టు పెట్టారు. "ఏడేళ్ల కాలం గడిచినా రవీ ఇప్పటికీ నువ్వు మా మధ్యనే ఉన్నట్టుగా ఉంది. మరణానంతర జీవితం ఎలా ఉంటుందో తెలియదు కానీ, నువ్వు చిరకాలం నా మనసులో ఉంటావు. మనం ప్రేమించినవాళ్లు నిజానికి మనల్ని ఎన్నటికీ వీడిపోరు. మృత్యువు కూడా దరిచేరని కొన్ని సంగతులు ఉంటాయి. నీ సాహచర్యం కూడా అలాంటిదే రవీ!" అంటూ భావోద్వేగాలు నిండిన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్టుకు ఇప్పటివరకు 91 వేల లైకులు రావడం విశేషం. దీనిపై అభిమానులు భారీ ఎత్తున స్పందిస్తున్నారు.
Anushka Shetty

More Telugu News